ఆరామద్రావిడ వంశ చరిత్రసీ. ఘనద్వివేదుల వంశ జనితుండు నమలుడ
   నంతపద్మనాభనామయసుడు
తనశాఖలోగల ధర్మముల్దెలియంగ
   సూక్షమౌరీతిని సొంపుగాను
ధరలోననా రామద్రావిడ శాఖలో
    గోత్రముల్ప్రవరలు సూత్రములును
వంశంబులింటి పేర్పక్షంబునిర్మించె దీక్షబూని.
                                                            -ఆణివిళ్ళ సుబ్బారావు

ఆరామద్రావిడ వంశ చరిత్ర అను ఈ గ్రంధమును, వంశ వృక్షమును బ్రహ్మశ్రీ ద్వివేదుల అనంత పద్మనాభ శర్మ గారు, 1919 వ సంవత్సరములో వ్రాయుట ప్రారంభించిరి. ద్రవిడ దేశమున నున్న ద్రావిడుల గూర్చి, వారి యొక్క శాఖలు,ఆచార వ్యవహారములు,వివాహాది శుభకార్యములు,విద్యా నైపుణ్యాలు, ఘనతను గూర్చి ఆయన అనేక
 విషయములను సేకరించి 1935 వ సంవత్సరమున పూర్తి చేసిరి.ఆనాడు ఆ ప్రతిని బ్రహ్మశ్రీ ఆణివిళ్ళ సుబ్బారావు  గారు, బ్రహ్మశ్రీ అల్లమరాజు రామకృష్ణ కవి గారు, బ్రహ్మశ్రీ పంతుల సుబ్బయ్య శాస్త్రి గారు పరిశీలించి వ్యాపింప చేసిన బాగుండును అని వారి అభిప్రాయములు తెలియజేసిరి. ఆనాటి ఆర్ధిక పరిస్థితిని బట్టి అనంత పద్మనాభము గారు అనేక కాపీలు వ్రాసి ఇచ్చారు.


 అనంత పద్మనాభ శర్మ గారి కుమారుడైన, ద్వివేదుల వేంకట రామారావు గారు, ఆ కాలమునందు వ్రాయబడిన ఆ ప్రతిని, పోషకుల, ప్రోత్సాహకుల కోరికపై ముద్రణకు  అనుకూలముగాను, నేటి వరకూ ఈ శాఖలో ఖ్యాతినొందిన వారి వివరములు చేర్చి ముద్రించిరి.


పుస్తకము ముందు భాగము


పుస్తకము వెనుక భాగము (ఈ చిత్రములు రెండునూ, వేంకట రామారావు గారు స్వయముగా చిత్రించిరి.)


రచయిత ద్వివేదుల వేంకట రామారావు, వేంకట సోమేశ్వరమ్మ

 తరాలు మారినా, ఈ ఆరామద్రావిడ వంశ పూర్వీకుల ఘనత, చరిత్ర, వేంకట రామారావు గారి కుమారులైన అనంత పద్మనాభం, రామాంజనేయ రావు ల వద్ద  పుస్తక రూపం లో భద్రమై వుంది.ఈ గ్రంధమునందు ఏఏ విషయములు వున్నవో  Contents  నందు తెలుప బడినది. ఆసక్తి కల వారలు ప్రతుల కొరకు, సమాచారము కొరకు  Contacts  నందు ఇవ్వబడిన ఫోను నంబరులకు సంప్రదించగలరు.